తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!

National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!

పెన్ పహాడ్, మన సాక్షి :

పెన్ పహాడ్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మారం పవిత్రకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రకటించినది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే జాతీయో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల టీచర్ మారం పవిత్రకు లభించినది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏట ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు జాతీయ అవార్డుకు దరఖాస్తులు చేసుకోగా వారిలో సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రను జాతీయ ఉత్తమ 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలుగా మారం పవిత్ర పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు కోరిన నేపథ్యంలో ఆమె అవార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు రావడంపై మారం పవిత్ర స్పందించారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. సూర్యాపేట జిల్లా కి కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ అవార్డులకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 45 మంది టీచర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

MOST READ : 

  1. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  2. School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

  3. SRR : పీహెచ్డీ పరిశోధన కేంద్రంగా ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల..!

  4. Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!

మరిన్ని వార్తలు