News : పార్టీ మారిన ఎమ్మెల్యేలు ట్విస్ట్.. ఒకే మాట.. ఒకే నిర్ణయం..!

News : పార్టీ మారిన ఎమ్మెల్యేలు ట్విస్ట్.. ఒకే మాట.. ఒకే నిర్ణయం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గురువారం నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం అందింది. కానీ సీఎల్పీ భేటికి హాజరు కావద్దని అందరూ ఒకే మాటపై ఉన్నారు. నిర్ణయించుకున్న మాదిరిగానే సిఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్ (ఖైరతాబాద్) తెల్లం వెంకటరావు (భద్రాచలం) కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్) పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ) అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరువు) కాలే యాదయ్య (చేవెళ్ల) సంజయ్ కుమార్ (జగిత్యాల) ఉన్నారు.
పార్టీ ఫిరాయించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండడంతో పాటు అసెంబ్లీ కార్యదర్శి నుంచి నోటీసులు కూడా రావడం వల్ల సిఎల్పీ సమావేశానికి హాజరు కావద్దని వీరంతా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సిఎల్పీ సమావేశంలో ఈ మేరకు చర్చలు చేశారు. స్థానిక సంస్థల బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులకే అప్పగించారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.
MOST READ :
-
CLP : సీఎల్పీ సమావేశంలో సంచలనం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..!
-
Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!









