Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తుంది. దాంతో పసిడి ప్రియుల్లో ఆనందం కలుగుతుంది. ఇటీవల తులం బంగారం ధర లక్ష రూపాయలకు పైగా అయిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం 100 గ్రాముల బంగారం కు 1100 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1100 రూపాయలు తగ్గి 9, 75,800 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 1000 రూపాయలు తగ్గి 8,94,500 రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల తులం బంగారం మంగళవారం 24 క్యారెట్ కు 97,580 ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 89,450 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, వరంగల్, కర్నూలు, నల్లగొండ పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
వరుసగా తగ్గుతున్న బంగారం ధర :
గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం (జూన్ 07) 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 16,300 రూపాయలు తగ్గగా ఆదివారం ధరలు నిలకడగా ఉన్నాయి. సోమవారం (జూన్ 7) 2800 రూపాయలు తగ్గింది. అదేవిధంగా మంగళవారం (జూన్ 10) 1100 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్స్ బంగారం కు శనివారం (జూన్ 7వ తేదీన) 15 వేల రూపాయలు తగ్గగా ఆదివారం ధర నిలకడగా ఉన్న ధరలు సోమవారం (జూన్ 9) 2500 రూపాయలు, మంగళవారం (జూన్ 10) 1000 రూపాయలు తగ్గింది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!
-
Farmer : ఆ ప్రభుత్వ పథకాలకు.. ప్రతి రైతుకు ఇది తప్పనిసరి.. బిగ్ అలర్ట్..!
-
Rythu : రైతుల ఖాతాలలో రూ.10వేలు.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!









