తెలంగాణBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : పసిడి ధర మళ్లీ పై పైకి.. తులం ఎంతంటే..!

Gold Price : పసిడి ధర మళ్లీ పై పైకి.. తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు మరోసారి ధరలు షాక్ ఇచ్చాయి. సంక్రాంతి పండుగ వరకు నిలకడగా ఉంటుందనుకున్న మహిళలకు మళ్లీ ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం 80,000 రూపాయల చేరువకు వెళ్తుంది. నూతన సంవత్సరంలో కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు నిలకడగా ఉన్న బంగారం ధర బుధవారం మళ్లీ పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1100 రూపాయలు, 22 క్యారెట్స్ బంగారం కు 1000 రూపాయల ధర పెరిగింది. మంగళవారం 100 గ్రాముల 22 క్యారెట్స్ ధర 721,500 రూపాయలు ఉండగా బుధవారం 7,22,500 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ మంగళవారం 7,87,100 రూపాయలు ఉండగా బుధవారం 7,78,200 రూపాయలు ఉంది.

హైదరాబాదులో తులం బంగారం (10 గ్రాములకు) బుధవారం 22 క్యారెట్స్ 72,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ తులం (10 గ్రాముల) బంగారం 78,820 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఉన్నాయి.

RELEATED NEWS : 

మరిన్ని వార్తలు