Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా పెరుగుతూ తులం బంగారం లక్ష రూపాయలకు చేరువవుతుందని ఆందోళన చెందిన మహిళలకు భారీగా ఊరట కలిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వరుసగా బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత శుభకార్యాల సీజన్ లో ధరలు తగ్గటం.. కొనుగోలుదారులకు ఊరట కలుగుతుంది.
హైదరాబాదులో సోమవారం 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 2008 వందల రూపాయలు తగ్గింది. ఆదివారం 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం 9,06, 600 రూపాయలు ఉండగా సోమవారం 2500 రూపాయలు తగ్గి 9,03, 800గా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల బంగారం కు 2500 రూపాయలు తగ్గింది. ఆదివారం 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 8,31,000 ఉండగా 2500 రూపాయలు తగ్గి ₹8,28,500గా ఉంది.
తులం ధర..?
హైదరాబాద్ లో (10 గ్రాముల) తులం బంగారం ధర సోమవారం 24 క్యారెట్స్ 90,380 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం ధర 82,850 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.









