Breaking Newsతెలంగాణనల్గొండ

చింతపల్లి రైతు వేదికలో భూ నిర్వాసితుల ఆందోళన..స్పెషల్ కలెక్టర్ శ్రీదేవిని అడ్డుకున్న రైతులు..!

చింతపల్లి రైతు వేదికలో భూ నిర్వాసితుల ఆందోళన..స్పెషల్ కలెక్టర్ శ్రీదేవిని అడ్డుకున్న రైతులు..!

చింతపల్లి, మన సాక్షి :

డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా దేవరకొండ నియోజకవర్గం లో ప్రభుత్వం చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జూన్ 2016లో రైతుల నుండి నుండి డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది. అప్పటి భూముల నిబంధన ప్రకారం ఒక ఎకరాకు 5 లక్షల 15 వేల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించి రైతుల భూములను తీసుకోవడం జరిగింది.

అధికారులు ప్రాజెక్ట్ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన 3 సంవత్సరాల లోపు రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు అప్పుడు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం 3-3-2020 న, 425 మంది రైతులతో ఇరిగేషన్ అగ్రిమెంట్ జరిగింది. నేడు జూలై 31 న చింతపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులతో గ్రామసభ నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు గ్రామాల రైతుల సూచనలు సలహాలు జిల్లా స్పెషల్ కలెక్టర్ అధికారిని శ్రీదేవికి రైతుల వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్క రైతు అడిగిన ప్రశ్నలకు తగు సమాధానాలు ఇచ్చారు. రైతుల మాత్రం ప్రభుత్వం భూ నిర్వాసితులకు కేటాయించిన డబ్బులకు రైతులు అసంతృప్తికి లోనై ప్రతి ఎకరాకు 50 లక్షల కు వరకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిచో మాకు ప్రాజెక్టు కూడా అవసరం లేదని రైతులు మీటింగ్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులతో సమావేశం ఏర్పాటు చేయడానికి విచ్చేసిన స్పెషల్ కలెక్టర్ శ్రీదేవి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఈ సతీష్, ఈఈ యాదన్ కు మార్,ఏఈ,హనుమాన్. రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : 

Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!

NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

MIRYALAGUDA : మిర్యాలగూడలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్..!

Telangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

మరిన్ని వార్తలు