Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపని పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి సంఘాల ధర్నా..!

ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపని పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి సంఘాల ధర్నా..!

దేవరకొండ, మనసాక్షి :

స్కూల్ ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపకుండా స్కూల్లోనే సాయంత్రం వరకు ఉంచుకున్నారని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జాతీయ కో కన్వీనర్ పొంగూరు వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగవెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లమాళ్ళ ఆంజనేయులు, ముదిగొండ మురళీకృష్ణ ,వైస్సార్సీపీ సిరాజ్, సౌభాన్ మాట్లాడుతూ లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ పాఠశాలలో చైత్ర (యూకేజీ), దానవీ (నర్సరీ) ఇంటికి పంపకుండా పాఠశాలలోనే ఉన్నారనే సమాచారం తెలుసుకొని వచ్చినట్లు తెలిపారు.

విద్యార్థులను ఫీజులు చెల్లించలేదని కారణంతో పాఠశాలలో యాజమాన్యం సాయంత్రం 6:30 ఈ యొక్క పాఠశాలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాబట్టి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ వివరణ :

గత నాలుగు నెలల నుంచి విద్యార్థినిలు ఫీజు చెల్లించకపోవడం వల్లనే శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు విద్యార్థినిల తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. వారిని స్కూల్ వ్యాన్లో ఇంటికి పంపకుండా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చేవరకు పాఠశాలలోనే మాతోనే ఉన్నారు. ఆరు గంటలకు వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు