Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
దేవరకొండ, మనసాక్షి :
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెయ్యి కోట్ల రూపాయలతో పూర్తి కావలసిన ఎస్ఎల్బీసీ సొరంగం ఇప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలకు పెరిగిందని, రాష్ట్ర ఖజానాపై పెనుబారం పడిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని ఎస్ఎల్బీసీ సొరంగం పనులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి తో కలిసి ఆయన సందర్శించారు.
శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం ( ఎస్ ఎల్ బి సి ) ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ….ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తాం .. నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే 14 కోట్లు నిధులు అవసరమవుతాయి… 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉంది అన్నారు. నెలకు 400 మీటర్లు కాదు అంతకన్నా ఎక్కువ తవ్విన.. ఎంత మేరకు తవ్వితే అంత మేరకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు..
రెండు సంవత్సరాలు క్యాలెండర్ నిర్ణయించుకుని ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయాలి అన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం అన్నారు. గత పాలకులు, గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ కూడా తవ్వకుండా శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేశారు అని అన్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం… గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 4వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెను భారం పడింది అన్నారు.
సీఎల్పీ నేతగా బట్టి విక్రమార్కు, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి సొరంగ మార్గం పూర్తికి ఆనాటి ప్రభుత్వం పై తీవ్రవత్తిడి తెచ్చాం .. పోరాటం చేసాం అని అన్నారు. గోదావరిపై లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరం కడితే కుంగిపోయింది అన్నారు. కృష్ణానది పై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదు అన్నారు. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణ నుంచి గత పది ఏళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు అన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను…గత పాలకులు పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది.. నీళ్ల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు అన్నారు. ప్రగతిలో ఉన్న ప్రాజెక్టును వదిలేసి రీడిజన్ల పేరిట గత ప్రభుత్వం లక్షల కోట్లు దోపిడీ చేసింది.. ఫలితంగా రాష్ట్ర ఖజానా దివాలా తీసి ఏడు లక్షల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయి అన్నారు. ఆ బాధతోనే గత ఏడాది మండుటెండల్లో మార్చి నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేశాను అన్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా అన్ని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించాను ఆ క్రమంలో ఎస్ఎల్బీసీ దగ్గరకు సైతం వచ్చాను అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే ఇక్కడే కూర్చొని సమీక్ష చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని నాడు పీపుల్ మార్చ్ పాదయాత్రలో ప్రకటించాను. ప్రజలందరి ఆశీస్సులతో అన్నట్టుగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది అన్నారు.
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది అన్నారు. ఆరు నెలలు ,ఏడాది రెండు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ ఉన్న ఎస్ ఎల్ బి సి పూర్తి అయితే నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతాయి అన్నారు.
నక్కలగండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నెల నెల నిధులు కేటాయించి పూర్తి చేస్తాం అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులను నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలి అన్నారు.
సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్తు అవసరాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి విద్యుత్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి అన్నారు. వారి వెంట ఎమ్మెల్యేలు భత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, వేముల వీరేశం, బాలు నాయక్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
-
మహిళలకు శుభవార్త.. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!
-
Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!
-
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
-
దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
-
TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!











