Suryapet : కాలుష్యపు కంపు.. పత్తాలేని నియంత్రణ అధికారులు..!
Suryapet : కాలుష్యపు కంపు.. పత్తాలేని నియంత్రణ అధికారులు..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనావాసాల మధ్య ఉన్న రైస్ మిల్లులతో ప్రజలు జీవించలేకపోతున్నారు. నిత్యం కంపు కొడుతున్న దుర్వాసన అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చేయాల్సిన మిల్లులు ఏమి పట్టించుకోకుండా దుర్వాసన నీటిని బయటికి వదులుతున్నారు.
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఉన్న పారా బయిల్డ్ మిల్లు నుండి వెలువడుతున్న దుర్వాసన వెలువడుతోంది. భరించలేకపోతున్నామంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
నిత్యం మిల్లు నుండి వెదజల్లుతున్న దుమ్ము దూళితోపాటు, చెడు వాసనలతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మిల్లు నుండి దుర్వాసన రాకుండా చేయాలని స్థానికులు మిల్లు యాజమాన్యానికి చెప్పే ప్రయత్నం చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెపుతున్నారు.
మిల్లు యాజమాన్యం ఎదురుదాడి :
నిత్యం మిల్లు నుండి వెలువడుతున్న దుమ్ము ధూళి తో నివాసాలు దుమ్ముతో కప్పబడి ఇబ్బందులు పడుతున్నామని సమీప నివాసాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన యాజమాని ఎదురుదాడికి దిగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెపుతున్నారు.
చర్యలు తీసుకోవాలి :
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మిల్లు నుండి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా అభివృద్ధి కి దూరమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పారిశ్రామిక నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మిల్లు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా నివాసాలకు దూరంగా మిల్లు ను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
LATEST UPDATE :
-
New Scheme : రైతులకు శుభవార్త.. రూ.600 కోట్లతో కొత్త పథకం..!
-
Miryalaguda : సాగర్ ఎడమకాల్వలో అంగనవాడీ టీచర్ గల్లంతు.. ప్రాణాపాయ స్థితిలో బయటపడిన ఆమె భర్త..!
-
Health : ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంట్లో తయారుచేసిన పానీయాలు.. గుండె, మూత్రపిండాలు భద్రం..!
-
Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!









