Breaking Newsతెలంగాణసంగారెడ్డి జిల్లా
ఈదురు గాలుల బీభత్సం..!

ఈదురు గాలుల బీభత్సం..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం కురిసింది. మండల సుక్కల్ తీర్థ్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో పైన ఉన్న రేకుల షెడ్డు ఎగిరిపడి 6 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్న చిన్న గాయాలు మినహా ఎవరికీ నష్టం జరగలేదని గ్రామస్తులు చెప్పారు.
” ఈదురు గాలులతో వర్షం “
మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో చాప్టా (కే) , రాజారాం తండా గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. బలమైన గాలి వీయడంతో కొందరి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరిపోయాయి. ఈ వర్షం ద్వారా కోతకు వచ్చిన జొన్న పంటకు నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు.
MOST READ NEWS :
-
Mangapeta : గీత కార్మికుల సాంఘిక బహిష్కరణ.. కఠినంగా శిక్షించాలని నిరసన..!
-
బతికుండగానే చంపేశారు.. సారూ.. ఇంకా నేను చనిపోలేదు..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!
-
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
-
Suryapet : హంగ్రీ బర్డ్స్ హోటల్ లో ఈగలు బిర్యాని.. రూ.5 వేల జరిమానా..!









