శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం.. కమనీయం..!
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గల చారిత్రాక దేవాలయం శ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని సోమవారం తెల్లవారుజామున వేద పండితులు సూర్యనారాయణ శర్మ, సతీష్ శర్మ, బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం.. కమనీయం..!
వేములపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గల చారిత్రాక దేవాలయం శ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని సోమవారం తెల్లవారుజామున వేద పండితులు సూర్యనారాయణ శర్మ, సతీష్ శర్మ, బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 300 మంది దంపతులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీప మండలాల నుంచి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కాగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, సర్పంచులు, సందీప్, ఎలికట్టి భరత్, ఈవో మృత్యుంజయ శాస్త్రి, ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- ACB : ఏసీబీ అధికారుల మెరుపుదాడులు.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అధికారి..!
- TG : అన్నారం బ్యారేజ్ ని కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణ..!
- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టత..!
- TG : అన్నారం బ్యారేజ్ ని కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణ..!