Champion : నేషనల్ గేమ్ ఛాంపియన్‌కు ఎంపికైన యువతి.. దాతల కోసం ఎదురుచూపు..!

Champion : నేషనల్ గేమ్ ఛాంపియన్‌కు ఎంపికైన యువతి.. దాతల కోసం ఎదురుచూపు..!
ముదిగొండ, మన సాక్షి :
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని గందసిరి గ్రామానికి చెందిన దివంగత బుయ్య కృష్ణ, తిరపతమ్మ దంపతుల కుమార్తె అయిన ఉమ, క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది. ఈ ప్రతిభతోనే ఆమె ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు గోవాలో జరగబోయే నేషనల్ యూత్ గేమ్ ఛాంపియన్షిప్ కు ‘బెస్ట్ ప్లేయర్’గా ఎంపికైంది. జాతీయ స్థాయిలో పోటీపడాలనే కలను నిజం చేసుకునే అవకాశం ఉమకు దక్కింది.
అయితే, గోవాకు వెళ్లి ఈ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో, క్రీడాకారిణి ఉమ ఇప్పుడు దాతలు, దయగల మనుషుల సహాయం కోసం ఎదురుచూస్తోంది. జిల్లాకు పేరు తెస్తానంటున్న ఉమ ఎవరైనా దాతలు నాకు సహాయం అందిస్తే, నేను తప్పకుండా నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటాను అని తెలియజేస్తుంది. నేను అనుకున్నది సాధించి, మన ఖమ్మం జిల్లాకు, ముదిగొండ మండలానికి మంచి పేరు తీసుకొస్తాను అని ఉమ ఎంతో ఆశతో, ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
ఒక ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి కేవలం ఆర్థిక సహాయం లేదనే కారణంతో జాతీయ వేదికపై రాణించే అవకాశాన్ని కోల్పోవడం బాధాకరం. ఉమ కలను సాకారం చేసేందుకు, దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుకుంటుంది.
సాయం అందించేందుకు వివరాలు:
బుయ్య ఉమకు ఆర్థిక సహాయం అందించాలనుకునే దాతలు ఈ కింది ఫోన్ పే (ఫోన్ పే) & గూగుల్ పే (గూగుల్ పే ) నంబర్‌ను ఉపయోగించి నేరుగా సాయం చేయవచ్చు:
ఫోన్ నెంబర్: 8374359171
MOST READ :
-
Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!
-
New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!
-
Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!









