Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!
Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!
పెన్ పహాడ్, మన సాక్షి :
గతంలో మాదిరిగా రైతులు బురద పొలాలు వరి నాటుమడులు ఇక లేవు. పొడిదొక్కిలో వారి విత్తనాలు విత్తే పద్ధతే అనుకూలమైన పద్ధతి. అధిక దిగుబడి కూడా వస్తుంది. ఖర్చు కూడా తక్కువ.. గ్రామాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దాంతో రైతులు ఎక్కువగా వరి విత్తనాలు విత్తే పద్ధతితోనే సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో వెంకన్న క్షేత్రంలో ఐ.సి.ఎ.ఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ ఆధ్వర్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీ.ఎస్.ఆర్ ఫండ్ సహకారంతో నేరుగా విత్తే పద్ధతి వరి సాగు చేసే రైతులకు పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టే విధానాన్ని రైతులకు కే . వి.కే – గడ్డిపల్లి శాస్త్రవేత్తలు డి నరేష్ , ఏ కిరణ్ అవగాహన కల్పించారు.
శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు లేవు.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది. ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతి వంటివి అమలు అవుతున్నాయి. సరికొత్తగా ఈ ఆధునిక పద్ధతిని అవలంబించడంతో చాలామంది రైతులకు ఖర్చు తగ్గడంతోపాటు మంచి దిగుబడి వచ్చింది.
వర్షాభావ పరిస్థితుల్లో మిషన్ ద్వారా నేరుగా విత్తనాలు నాటే విధానంతో రైతులకు ఎకరాకు రూ. 6- 8 వేలు ఆదా అవుతున్నది. కూలీల సమస్యలు తీరిపోతున్నాయి. పొడి దుక్కిలో పెసర, కంది, వేరుశనగ ఎలా ఎద పెడతారో అలానే వరి విత్తనాలు కూడా ఎద పెడుతున్నారు.
సీడ్ కం ఫెర్టిలైజర్ మిషన్‌తో సాగు చేస్తూ రైతులు మంచి దిగబడి సాధించవచ్చు అని తెలిపారు. అదేవిధంగా చీడ పీడల సమస్య, నీటి యజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులును రైతులకు వివరించారు.వరి నేరుగా విత్తే విధానం ద్వారా ద్వారా దిగుబడి పెరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మామిడి వెంకన్న, జ్యోతి, సర్వయ్య హుస్సేన్, రవి, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Vemulapally : ఎమ్మార్పీ దాటి విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయాధికారి ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ..!
-
BJP President : తెలంగాణ బిజెపి రథసారధిగా రామచందర్ రావు..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళపై ఆర్.ఎం.పి అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి..!









