Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య ఉండకూడదు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

Miryalaguda : ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య ఉండకూడదు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో తాగు నీటి సమస్య ఉండకూడదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో  ఆర్ డబ్ల్యూ ఎస్ , మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారులు అధికారులతో సబ్ కలెక్టర్ ఎం.నారాయణ్ అమిత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటి కొరత లేకుండా కరెంట్ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఎఓ శ్రీనివాస్ శర్మ, తహసీల్దార్ ఎన్.హరిబాబు, ఎంపీడిఓలు ఎం.శేషగిరిశర్మ, శ్రీనివాస్ మూర్తి, విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎండీ. యూసుఫ్, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్డబ్లుఎస్, మున్సిపల్ శాఖల డిఇఇలు గోపినాథ్, ఎండి. అన్వర్, వెంకట్ రెడ్డి, వెంకన్న, విద్యుత్ డిఇ శ్రీనివాస్ సుధీర్ కుమార్, ఎడిఇ కె.రవికుమార్, ఎఇఇ రవీందర్ రెడ్డిలున్నారు.

అనంతరం దామరచర్ల మండలంలో ఇండియన్ సిమెంట్, అంబుజా సిమెంట్(పెన్నా) యాజమాన్యంతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడుతూ ఇండియన్ మరియు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రతీ గ్రామంలో త్రాగు నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకోవాలని సూచించారు. పరిసరాలలో ఉన్న గ్రామాలకు కావాల్సిన విద్య, వైద్య మౌలిక వసతులు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామాలకు అందజేయాలని సూచించారు.

దామరచర్ల మండలంలోని వాడపల్లి, ఇర్కిగూడెం, గణేష్ పాడ్, శూన్యపాడు గ్రామాలలో త్రాగు నీరు లేక ప్రజలుల్ ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామాలలో తమ సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఉచితంగా ఆర్ఓ వాటర్ కిట్స్ పంపిణీ చేయాలని సూచించారు.

అనంతరం అధికారులతో కలసి వాడపల్లి మిషన్ భగీరథ ప్లాంట్ లో ఫిల్టర్ బెడ్ పరిశీలించారు. దామరచర్ల మండలం చుట్టూ గ్రామాలకు నీటి కొరత లేకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. ఆయన వెంట దామరచర్ల తహసిల్దార్ జవహర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  4. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

మరిన్ని వార్తలు