Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల ముఠాను 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. 9 మంది గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
నిందితుల వివరాలు:
1) ఉప్పుటోళ్ళ అమరలింగం మాచర్ల, పల్నాడు
2) మహమ్మద్ జునేద్ ( సీతారాంపురం, మిర్యాలగూడ టౌన్)
3) మహమ్మద్ గౌస్ ( శాంతినగర్, మిర్యాలగూడ)
4) షేక్ జవీద్ ( భాగ్యనగర్, మిర్యాలగూడ టౌన్)
5) బొడ్డు శ్యామ్ ( భాగ్యనగర్, మిర్యాలగూడ)
6) పులిజల లక్ష్మి నారాయణ ( ఎన్ఎస్పి క్యాంప్, మిర్యాలగూడ టౌన్)
7) నాశబోయిన గణేష్ ( బంగారిగడ్డ, మిర్యాలగూడ టౌన్)
8) బొమ్మాజీ గౌతమ్ నందా (భాగ్య నగర్ కాలనీ, మిర్యాలగూడ టౌన్)
( ముత్తిరెడ్డికుంట, మిర్యాలగూడ టౌన్)
9) మహమ్మద్ తాజుద్దీన్ ( సీతారాంపురం, మిర్యాలగూడ టౌన్)
మిర్యాలగూడ టూ టౌన్ యస్.ఐ. రాంబాబు సిబ్బంది తో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తూ ఎన్ ఎస్సి క్యాంప్ లో ని కళాభారతి పక్కన ఉన్న నిర్మానుష ప్రదేశానికి రాగా, అక్కడ అనుమాస్పదముగా కొందరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుండగా పట్టుబడి చేసి విదారించారు. వారు గంజాయి ని కలిగి ఉండి, క్రయ విక్రయాలు చేస్తున్నారని తెల్వడంతో అరెస్టు చేసినట్లు డిఎస్పి వెల్లడించారు.
నేరం జరిగిన విధానము:
ఉప్పుటోళ్ళ అమరలింగం అనునతనికి ఆర్ధికంగా ఇబ్బంది అవ్వడంతో ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనుకొని, గంజాయి అమ్మితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆలోచన రావడంతో గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నాడు విశాఖపట్నం జిల్లాలోని దారకొండ లో దొరుకుతుందని తెలిసి, అక్కడికి వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయిని కొనుగోలు చేసి..
జునేద్ అలీ, అతని తమ్ముడు అయిన గౌస్, షేక్ జవీద్, బొడ్డు శ్యామ్, పులిజల లక్ష్మి నారాయణ @ సాయి శ్యామ్. నాశబోయిన గణేశ్, బొమ్మాజ్ గౌతమ్ నందా మరియు మహమ్మద్ తాజుద్దీన్ లు కలిసి ఉప్పుటోళ్ళ అమరలింగం వద్ద గంజాయిని కొనుక్కుని వచ్చి..
చిన్న చిన్న పాకెట్లు చేసి మిర్యాలగూడ లో గంజాయి తాగే అలవాటు ఉన్న వాళ్ళకి అమ్మేవాళ్ళు, త్రాగేవాళ్ళు. ఆ విదంగానే ఉప్పుటోళ్ళ అమరలింగం ఉదయం 1.1 కిలోల గంజాయిని ప్యాక్ చేసి బస్ లో మాచర్ల నుండి మిర్యాలగూడ బస్ స్టాండ్ లో దిగి, అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి కళాభారతి పక్కన ఉన్న నిర్మానుష ప్రదేశంలో అందరినీ కలిసి, మిగిలిన వారందరూ గంజాయిని పంచుకొనే క్రమములో పోలీస్ వారుపట్టుబడి చేసినారు.
MOST READ :
-
Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!
-
Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!
-
Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!
-
VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!









