Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!
Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!
సూర్యాపేట, మనసాక్షి :
రుణమాఫీ కి సంబంధించిన సమస్యలు పరీక్షించడానికి మార్గదర్శకాలు ఈ రకంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ ఆదికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
1. మండల పరిధిలో ఉన్న అన్ని బ్యాంకులు మరియు సొసైటీస్ సంబంధించి మండల పరిధిలో ఉన్నవి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ /ఏ ఈ ఓ ద్వారా పరీక్షిస్తారు.
2. ఏ రైతులు ఆయితే అభ్యంతరాలు ఇస్తున్నారో అగ్రికల్చర్ ఆఫీసర్/ఏ ఈ ఓ ఆ రైతు యొక్క రైతు సమాచార పత్రం సి. ఎల్. డబ్ల్యూ పోర్టల్లో నుంచి రైతుకు అందజేస్తారు.
3. ఒకవేళ గ్రీవెన్స్ లో ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా వస్తే వ్యవసాయ అధికారి/ఏ ఈ ఓ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ని తీసుకువచ్చి సరైన ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ను CLW పోర్టల్ లో నమోదు చేయాలి ఒకవేళ రైతుకు ఆధార్ కార్డు నెంబర్ లేనిచో ఇతర కార్డులు అనగా ఓటర్ కార్డ్ వెహికల్ లైసెన్స్ రేషన్ కార్డ్ రైతు యొక్క పత్రాలు సి ఎల్ డబ్ల్యూ పోర్టల్ అప్లోడ్ చేయాలి.
4. గ్రీవెన్స్ నందు కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకపోతే వ్యవసాయ అధికారి/ఏ ఈ ఓ వాళ్ళ కుటుంబం యొక్క అందరి ఆధార్ కార్డులు తీసుకొని అవి వాటిని సి ఎల్ డబ్ల్యూ పోర్టల్ లో పొందుపరచాలి.
5. రైతు సమాచార పత్రంలో ఒకవేళ రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం లేదు అని వస్తే అదే రైతు దగ్గర నుంచి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని సి ఎల్ డబ్ల్యూ పోర్టల్ నందు పాసుబుక్ ను అప్లోడ్ చేయాలి.
6. రైతు సమాచార పత్రం నందు ఆధార్ మిస్ మ్యాచ్ అయి ఉంటే అప్పుడు లోన్ అకౌంట్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరుగా నమోదు అయిందనీ అర్థం,వాటిని లోన్ ఖాతాకు మరియు ఆధార్ కార్డు యొక్క పేరును సరిచేసి,ఆధార్ కార్డు లో ఉన్న పేరును సి ఎల్ డబ్ల్యూ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి.
7. గ్రీవెన్స్ నందు రైతు యొక్క రుణమాఫీ ప్రిన్సిపల్ అమౌంట్ మరియు ఇంట్రెస్ట్ అమౌంట్ తక్కువగా పడినట్లయితే అట్టి రైతులు ఒక దరఖాస్తు ఫారాన్ని తీసుకొని వారి యొక్కలోన్ తేదీలు వాటి యొక్క వివరాలు మొత్తం క్లుప్తంగా రాసి సి ఎల్ డబ్ల్యూ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలి. అదే ఇన్ఫర్మేషన్ బ్యాంకు దగ్గర నుంచి మళ్లీ తీసుకుంటారు.
8. పైన తెలిపిన గ్రీవెన్స్ల అన్నీ నమోదు చేయడానికి పోర్టల్ నందు డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి కొంత సమయం పడుతుంది
9. పైన తెలిపిన మార్గదర్శకాల ప్రకారం రుణమాఫీకి సంబంధించిన సమస్యల ను ప్రతిరోజు డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ హైదరాబాద్ కు సమస్యలన్నీ పంపి పరీక్షించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ ఆధికారి శ్రిదర్ రెడ్డి ఒక ప్రకటన లో తేలిపారు.
ALSO READ :
Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!
Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!
Jagdeesh Reddy : రైతులు అంతా ఐక్యం కావాలి.. మేము అండగా ఉంటాం..!









