BIG BREAKING : తెల్ల రేషన్ కార్డుదారులకు ఇక సన్న బియ్యం.. మంత్రి ఉత్తమ్ వెల్లడి..!
BIG BREAKING : తెల్ల రేషన్ కార్డుదారులకు ఇక సన్న బియ్యం.. మంత్రి ఉత్తమ్ వెల్లడి..!
మనసాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నరకం బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంలో అత్యంత కీలకమైన సన్న బియ్యం పంపిణీ త్వరలో చేపడుతామన్నారు. సన్న బియ్యం తో పాటు అవసరమైన ప్రాంతాలలో రాయితీ కల్పించి గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1629 డీలర్ల ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలో భర్తీ చేయాలని అధికారులు ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్ చౌహన్ పాల్గొన్నారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!









