Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు..!

దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో చికిత్స పొందుతున్న మహిళ సునీతను ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సారాద్యంలో బిఆర్ఎస్ మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులు పరామర్శించారు.

ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి బాధిత మహిళకు 1,లక్ష రూపాయలు సాయం చేశారు. ఈ సందర్భంగా సభిత ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ… దళిత మహిళా సునీతను పోలీసులు చాలా అవమానియంగా కొట్టారని సబిత వాపోయారు. ఒక ఆడపిల్లకు మగ పోలీసులు ఇలా చిత్రహింసలకు గురి చేయడం సబాబు కాదని ఇది సభ్య సమాజం తలదించుకునే చర్య అని ఆమె ఖండించారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై దాడులు, బాలికలపై ఆగయిత్యాలు ఎక్కువయ్యాయన్నారు. సునీత పై పోలీసుల దాడి సభ్యసమాజం తల దించుకునేలా ఉందన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు నిర్భందించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హెయమైన చర్య అన్నారు.

అన్నీ రంగాల్లో ముందుకువెళ్తున్న సమాజం కింది స్థాయి ప్రజల పట్ల ఇంకా అసమానత కొనసాగుతుందన్నారు. ఒక దళిత మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరియమ్మ అనే మహిళను చిత్రహింసలకు గురి చేస్తే సదరు పోలీస్ స్టేషన్ ఎస్సై తో పాటు ఇతర సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందని గుర్తు చేశారు.

సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు సునీతకు ఎందుకు మంచి వైద్యం ఇప్పించలేదని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సునీత కుటుంబాన్ని ఆదుకొని ఆమెపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి సబిత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… గత బిఆరెస్ ప్రభుత్వంలో కెసిఆర్ పోలీసు శాఖను ఫ్రెండ్లి పోలిసింగ్ ప్రోత్సాహస్తూ ప్రజల పట్ల మంచిగా ఉండేలా చూశారన్నారు.

మహిళల భద్రత కోసం సఖి సెంటర్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ పటిష్టం కోసం 700 కోట్లు కేటాయించి అన్నీ రకాలుగా అభివృద్ధి పరిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో పోలీసులు పేద ప్రజలపై అమాయకులపై దాడులకు ప్రోత్సాహిస్తుందన్నారు. బాధిత మహిళ సునీత నోటివెంట నిజాలు వింటుంటే తమకు బాధ కలుగుతుందని అన్నారు. సీఐ రాంరెడ్డికి నమస్తే పెడితే బాధితురాలు గుండెలపై బూటు కాలుతో తన్నిన సిఐ రామ్ రెడ్డి తీరు గర్వనీయమని అన్నారు.

సాయంత్రం ఆరు దాటితే ఆడపిల్లలు పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకోకూడదని విషయం పోలీసులకు తెలియదా ఏం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. విచారణ సమయంలో మహిళా పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. బాధిత మహిళా కు ఒక కోటి రూపాయలు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ డ్యామ్ 16 గేట్ల ఎత్తి నీటి విడుదల.. ఎడమ కాలువకు రెండు పంటలకు నీళ్లు..! 

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

BREAKING : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..!

మరిన్ని వార్తలు