క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Shankarpalli : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. పార్కింగ్ చేసిన బైకులే వీరి టార్గెట్..!

Shankarpalli : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. పార్కింగ్ చేసిన బైకులే వీరి టార్గెట్..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

బైకుల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధిలోని బిడియల్ రోడ్డు పక్కన గల డబల్ బెడ్ రూమ్ లలో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

శంకర్‌పల్లిలో నాలుగు, అత్తాపూర్ లో రెండు, మెహిదీపట్నంలో ఒకటి, గుడిమల్కాపూర్ లో రెండు, నార్సింగ్ లో రెండు, మొత్తం 11 బైకులను దొంగతనం చేశాడు.

శ్రీనివాస్ ఆర్టిఏ కు సంబంధించిన ఎం – వాలెట్ అనే యాప్ ను ఉపయోగించి, పార్కింగ్ లో పార్కు చేసిన ఏదైనా ఒక కలర్ బైక్ ఫోటోను తీసుకుని సేవ్ చేసుకునేవాడు. అనంతరం యాప్ లో ఆర్ సి డౌన్ లోడ్ కొరకు నాలుగు డిజిట్స్ నెంబర్ అడగగా ఫోటో తీసిన బైక్ నెంబర్ ను ఎంటర్ చేసేవాడు. ఆర్ సి డౌన్ లోడ్ అవ్వగానే ప్రింట్ తీసుకొని దొంగ పత్రాలను సృష్టించేవాడు.

శ్రీనివాస్ స్నేహితుడు నాగరాజు ద్వారా బైకులను దొంగ పత్రాలతో ఇతరులను నమ్మించి, మోసం చేసి విక్రయించేవాడు. నిన్న శుక్రవారం రాత్రి సీఐ శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన తనిఖీల్లో బైకు దొంగలను పట్టణ శివారులో అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

మిస్సింగ్ అయిన బైకుల ఏరియా పోలీస్ స్టేషన్ లకు శంకర్‌పల్లి పోలీసులు సమాచారం అందజేశారు. పదిహేను రోజులుగా శ్రమించి, కష్టపడి బైకు దొంగలను సీఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్న ముగ్గురు కానిస్టేబుల్ లను ఏసీపీ అభినందించారు. సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతికి ఈ క్రైమ్ న్యూస్ ను తెలియజేసి, పోలీసు సిబ్బందికి రివార్డ్స్ లను ప్రకటించడం జరుగుతుందని ఏసీపీ పేర్కొన్నారు.

MOST READ : 

  1. New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!

  2. District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!

  3. Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ..  రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

మరిన్ని వార్తలు