Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

BREAKING : క్వారీలో బండరాళ్లు కూలి ముగ్గురు కూలీలు దుర్మరణం..!

BREAKING : క్వారీలో బండరాళ్లు కూలి ముగ్గురు కూలీలు దుర్మరణం..!

మన సాక్షి :.

క్వారీలో బండ రాళ్లు కూలడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిధిలోని పరిటాలలో బండరాళ్ల క్వారీలో పనులు చేపడుతున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోమవారం కూడా కొంతమంది కూలీలు క్వారీలో చేస్తున్నారు. ఒక్కసారిగా బండ రాళ్లు కూలి వాళ్లపై పడ్డాయి.

ఆ ప్రమాదంలో ముగ్గురు కూలీలు రాళ్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు కూలీలు బండ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. గమనించిన తోటి కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాళ్ల కింద పడిన కార్మికులను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రో..!

Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!

మరిన్ని వార్తలు