క్రైంBreaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

TG News : స్కూటీని ఢీకొన్న టిప్పర్.. కుటుంబం మొత్తం దుర్మరణం..!

TG News : స్కూటీని ఢీకొన్న టిప్పర్.. కుటుంబం మొత్తం దుర్మరణం..!

మన సాక్షి, కామారెడ్డి :

స్కూటీని ఓ టిప్పర్ రాంగ్ రూట్ లో ఢీకొట్టడంతో కుటుంబం మొత్తం దుర్మరణం అయిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి 44 జరిగింది. గ్రామంలోని చత్రపతి శివాజీ విగ్రహం నుంచి కామారెడ్డి వైపు రాంగ్ రూట్ లో వెళ్తున్న మొరం టిప్పర్ భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో స్కూటీపై వస్తున్న ఆదిలాబాద్ కు చెందిన కిషన్ (54) తండ్రి, ఖమ్మం కు చెందిన ఆయన కూతురు జెస్లిన్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగు సంవత్సరాల మనవడు, మూడు నెలల వయసు గల చంటి పిల్లాడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసి కందు మృతి చెందాడు.

మూడు నెలల పసిపిల్లాడికి టీకా వేయించేందుకు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ నుంచి తెలిసిన సిస్టర్ ఉందన్న ఉద్దేశంతో జంగంపల్లి పల్లె దావఖానకు ఎలక్ట్రిక్ స్కూటీపై వస్తున్నారు. మరో రెండు నిమిషాలు అయితే ఆసుపత్రికి చేరుకునేవారు. అంతలోనే రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ వారిని ఢీకొనడంతో ప్రాణాలు వదిలారు. బిక్కనూర్ ఎస్సై లు ఆంజనేయులు, నరేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడ ఎంవీఐ గా చంద్రశేఖర్ గౌడ్.. ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానం..!

  2. Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  4. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు