Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్వ్యవసాయం

Urea : రైతులకు టోకెన్లు.. యూరియా పక్క దారి..!

Urea : రైతులకు టోకెన్లు.. యూరియా పక్క దారి..!

కొల్చారం, మన సాక్షి

సహకార సంఘం సిబ్బంది, పాలకవర్గ సభ్యులు చేతివాటం ప్రదర్శించి 210 బస్తాల యూరియా మాయం చేసిన సంఘటన ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం సహకార సంఘంలో జరిగింది. కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కొల్చారం సహకార సంఘానికి ఆదివారం ఉదయం 11 గంటలకు 500 బస్తాల యూరియా సరఫరా జరిగింది.

కొల్చారం రైతు వేదికలో పోతన శెట్టిపల్లి, కొల్చారం ఏఈవోలు సుమారు 150 మంది రైతులకు 300 బస్తాలకు సంబంధించి టోకెన్లు రాయగా కొల్చారం సీఈవో కృష్ణ రైతు వేదిక లోనే రైతుల వద్ద డబ్బులు తీసుకొని సుమారు 130 మంది రైతులకు బిల్లులు ఇచ్చాడు.సుమారు 290 బస్తాలకు సంబంధించి డబ్బులు వసూలు చేసుకుని బిల్లులు ఇచ్చినట్లు ఏవో తెలిపారు.

కాగా అప్పటికే కొల్చారం సహకార సంఘంలో మొత్తం యూరియా బస్తాలు ఖాళీ అయ్యాయి. సుమారు 210 యూరియా బస్తాలు ఎక్కడికెళ్లాయో ఎవరికి పంపిణీ చేశారు తెలియాల్సి ఉంది. ఏ ఈ ఓ లు 150 మంది రైతులకు టోకెన్లు ఇవ్వగా వారిలో చాలామందికి లభించలేదు.

కొల్చారం మండలం అంసన్ పల్లి గ్రామానికి చెందిన రైతులు బేగరి శ్రీనివాస్, కే చంద్రం, లక్ష్మణరావు లకు 151 ,152, 148 సీరియల్ నంబర్ టోకెన్ లు ఇవ్వగా వారికి యూరియా బస్తాలు లభించలేదు. 150 సీరియల్ లోపు ఉన్న చాలా మంది రైతులకు యూరియా లభించకపోవడంతో రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చి యూరియా లేకున్నా టోకెన్లు ఎలా రాస్తున్నారు అని ఆందోళన చేశారు. దీంతో సహకార సంఘానికి ఏవో శ్వేతాకుమారి ఏఈఓ నిరోషాలు చేరుకొని యూరియా బస్తాలు సహకార సంఘం లో మాయం కావడం పట్ల సహకార సంఘం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సహకార సంఘం సిబ్బంది, పాలకవర్గంపై తెలంగాణ ఎరువులు విత్తనాల చట్టం ప్రకారం కేసులు నమోదుచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఏవో శ్వేతా కుమారి తెలిపారు. ఈ మేరకు కొల్చారం పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

MOST READ : 

  1. Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!

  2. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

  3. Nalgonda : 24 గంటల్లో హత్య కేసు నిందితుడి అరెస్టు.. నల్లగొండ ఘటనలో సంచలన విషయాలు..!

  4. TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!

మరిన్ని వార్తలు