Breaking Newsజాతీయం

BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. (15-06-2025)

BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. (15-06-2025)

మన సాక్షి వెబ్ డెస్క్ :

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలతో మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఆదివారం బ్రేకింగ్ న్యూస్ టాప్ 5 మీ ముందు ఉంచుతుంది.

వీకెండ్ విషాదం.. ఆరుగురు మృతి :

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో మరో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన వద్దకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. కాగా భారీ వర్షం కారణంగా నదిపై ఉన్న వంతెన కుప్పకూలడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

——— ——-

మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు లేఖ :

గోదావరి నదిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం లేఖ రాశారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించే లోపే తెలంగాణ ప్రాజెక్టులను అనుమతులు రావాల్సి ఉండగా ఏపీ ఏకపక్షంగా ముందుకు వెళ్లడం అన్యాయం అన్నారు. కేంద్ర మంత్రికి ఇదే అంశంపై ఉత్తంకుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

——— ——-

గోదావరిలో నీట మునిగి ఐదుగురు వ్యక్తులు మృతి :

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో నీట మునిగి ఐదుగురు యువకులు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని చింతల్ ఏరియా కు చెందిన 18 మంది భక్తులు స్నానం కోసం గోదావరిలోకి దిగారు. ఐదుగురు వ్యక్తులు గోదావరిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో రాకేష్, వినోద్, మదన్, రితిక్, భరత్ ఉన్నట్లు తెలుస్తోంది.

———– ——

కుప్ప కూలిన హెలికాప్టర్. ఐదుగురు మృతి :

ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరొక ముందే ఉత్తరాఖండ్ లో ఆదివారం హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతికూల వాతావరణ కారణంగా హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలుస్తుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళుతుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాప్టర్ల ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సీరియస్ అయ్యారు.

——— ——

ఐదేళ్లలో ఆరు ఐసీసీ టోర్నమెంట్లు

రాబోయే ఐదు సంవత్సరాలలో ఆరు ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహించనున్నారు. అయితే మూడు టోర్నమెంట్లు మన దగ్గరే నిర్వహించనున్నారు. క్రికెట్ షెడ్యూల్స్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసింది. ఇక ఐదేళ్లు క్రికెట్ ప్రియులకు పండగే పండగ.

MOST READ :

  1. District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!

  2. TG News : రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.8 వేలు..!

  3. Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!

  5. Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ..  రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

మరిన్ని వార్తలు