BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్న మన సాక్షి వెబ్ సైట్ లో టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. అవేంటో పరిశీలిద్దాం..
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ :
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తుండగా విజయవాడలో 10 మంది ని పోలీసులు అరెస్టు చేశారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు దాడులు నిర్వహించి 13 మంది విధులను, 10 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
——-
నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం :
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ కలకలం. గ్రామ శివారులో కోళ్ల ఫారంలో 7 వేల కోళ్లు మృతి చెందినట్లు తెలిసింది. మరణించిన కోళ్లను జెసిబి సహాయంతో పెట్టినట్లుగా సమాచారం. ఆ యజమాని 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా ₹7000 మరణించాయి.
——-
మిర్చి రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి భరోసా :
మిర్చి రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి భరోసా
మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. క్వింటా మిర్చి ధరను రూ.11,600 పెంచాలన్న డిమాండ్‌పై సానుకూలంగా స్పందించారు. సాగు వ్యయాన్ని పెంచాలని ఐకార్ అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. మార్కెట్ రేటుకు, రైతులకు సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లిస్తుందన్నారు.
——-
చికెన్, ఎగ్, కర్రీలతో ఫ్రీ భోజనం :
చికెన్ గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకే హైదరాబాద్ ఉప్పల్ లోని వివిధ ప్రాంతాల్లో చికెన్, ఎగ్, ఫ్రీ మేళా నిర్వహిం చారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పదం బర్డ్‌ఫ్లూ. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ చికెన్, గుడ్ల వ్యాపారంపై పడింది. ఈ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో చికెన్, గుడ్లు తినకూడదనే వదంతులు అనేకం వినిపించాయి.
ఈక్రమంలో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదనే భయాన్ని పోగొట్టేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంట నగరాల్లో శుక్రవారం చికెన్, ఎగ్, ఫ్రీ భోజనం మేళాలు నిర్వహించారు.
——
సాహసం చేస్తున్నా – రేవంత్ రెడ్డి :
దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం తాను చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అని చెప్పారు. రాహుల్ గాంధీ హామీ మేరకే కులగణన చేపట్టినామని, బీసీల సంఖ్య పై గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని, తాము అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Most Read News :
-
SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
-
SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!
-
Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!









