Hyderabad : హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!
Hyderabad : హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ నగరంలో శనివారం ఈనెల 17వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సహల్గా టెర్రరిస్టు దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా విజయ యాత్ర చేపట్టారు.
హైదరాబాదులో తిరంగా యాత్రకు బిజెపి పిలుపునిచ్చింది. తిరంగా యాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొననున్నారు.
శనివారం మే 17వ తేదీన హైదరాబాదులో తిరంగా యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డి.బి.ఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
ఆ సమయంలో వాహనాల దారి మళ్లించుట చేయనున్నట్లు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ డేవిస్ కోరారు.
క్లిక్ చేసి ఇది కూడా చదవండి
-
District collector : శ్యామ్, మ్యామ్ పిల్లలపై దృష్టి సారించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!
-
FY Results : రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్.. లాభాల్లో వృద్ధి, స్థిరమైన ఆర్థిక ప్రదర్శన..!
-
TCS: టీసీఎస్ ఘనత.. ప్రపంచంలోని టాప్-50 బ్రాండ్స్‌లో ఒకటిగా గుర్తింపు..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!
-
Health : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన..! హెల్త్ కేర్ పై ప్రభుత్వం దృష్టి..!









