Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోజు వాహనదారులు అటువైపు వెళ్లొద్దు..!

Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోజు వాహనదారులు అటువైపు వెళ్లొద్దు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్డీవో శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నందున పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్డు వరకు, మున్సిపల్ ఆఫీస్ నుండి టాకా రోడ్డు వరకు, రైతు బజార్ నుండి ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ రోడ్డు వరకు, ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ నుండి టాకా రోడ్డు, ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ పక్కనే ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు.

ఆరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ఆయన కోరారు.

అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణ పనులు, స్వాతంత్ర దినోత్సవ సన్నాహక పనులు జరుగుతున్నందున ఈనెల 13, 14, 15 వ తేదీలలో ఎన్ఎస్పి క్యాంపులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆయన తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలకు పట్టణ ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి : 

Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు