క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాద సంఘటన జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు.

అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాద సంఘటన జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఘటన. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు.

మెకానిక్ ద్విచక్ర వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఆ వ్యక్తి బండిని స్టార్టింగ్ లో ఉంచి ఇంటి గడివేయడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందగా.ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు