Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!

Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రాఖీ పండగ పూట విషాదం నెలకొన్నది. ఫుడ్ పాయిజన్ తో నలుగురు విద్యార్థులు మృతి చెందగా మరో ఇద్దరికి కూడా పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలోని కైలాసపట్నం అనాధ పాఠశాలలో ఉదయం టిఫిన్ తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి.

27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. నలుగురు విద్యార్థులు మృతి చెందగా ఇద్దరికీ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు.

ఫుడ్ పాయిజన్ ఘటనకు పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ఆర్డిఓ జయరాం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులకు పెరుగైన చికిత్స కోసం కే జి హెచ్ కు తరలించారు. విద్యార్థుల మృతి పట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ALSO READ : 

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

PDS RICE : అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!

మరిన్ని వార్తలు