క్రైంBreaking Newsజాతీయం

Reels : రీల్స్ చేస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు అమ్మాయిలు మృతి..!

Reels : రీల్స్ చేస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు అమ్మాయిలు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఒకేసారి ఫేమస్ అయిపోవాలని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా రీల్స్ చేస్తూ ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. గతంలో టిక్ టాక్ కూడా ఇలాంటి రీల్స్ చేయగా ప్రమాదాలు జరగడంతో టిక్ టాక్ ను దేశంలోనే బ్యాన్ పెట్టింది. ఇప్పుడు ఇన్ స్టా ల్ లో ఫేమస్ కావాలని అనేకమంది రీల్స్ పిచ్చిలో ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు.

తాజాగా రీల్స్ మోజులో ఆరుగురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం .. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలో నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరు అమ్మాయిలు రీల్స్ వీడియో చేయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. ఆ నది వారి ఇళ్లకు ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు.

వీడియో చేస్తుండగా అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతు ప్రదేశంలోకి వెళ్ళింది. నీటిలో మునిగిపోతుందని గమనించిన వాళ్లు అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు కూడా వారిని రక్షిద్దామని అనుకున్నారు. వారి వల్ల కాలేదు. దాంతో ఆరుగురు అమ్మాయిలు నీటిలో మునిగిపోయారు.

విషయం తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు. వారిలో నలుగురు అప్పటికే చనిపోగా మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వారికి డాక్టర్లు సిపిఆర్ చేయగా బతికారు. అయితే కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందినవారు. అక్క చెల్లెలు అవుతారు. వీరి మృతితో కుటుంబం తోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

MOST READ :

  1. WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!

  2. Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

  3. Darna : మా భూముల జోలికి రావద్దు.. గిరిజన రైతుల ధర్నా..!

  4. WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

  5. Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు