Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. అర్హత లేని వారి రేషన్ కార్డులను రద్దు చేయనున్నారు. గత ఆరు మాసాలుగా రేషన్ తీసుకోని కార్డులపై విచారణ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా 1.59 లక్షల రేషన్ కార్డుదారులు రేషన్ తీసుకోకుండా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విచారణ ఇప్పటికీ 80% కార్డులను అధికారులు పరిశీలించినట్లుగా తెలుస్తుంది. వాటిలో 30% కార్డులు అర్హత లేనివిగా గుర్తించారు.

అయితే ఈ రేషన్ కార్డులలో అధికారిక వివరాల ప్రకారం.. పలు లోపాలు కనిపించినట్లు తెలుస్తోంది. వాటిలో ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండటం, కార్డుదారులు మరణించడం, డూప్లికేట్ ఆధార్ కార్డులు పొందడం వంటి వివిధ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి లోపాల కారణంగా చాలా కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది.

అర్హత లేని కారులను తొలగించి పోరాసరఫరాల వ్యవస్థను మరింతగా పటిష్టవంతంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నది. త్వరలోనే అనర్హుల కార్డులను రద్దు చేసే ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత అర్హులైన వారికి కొత్త కార్డుల జారిపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

MOST READ :

  1. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

  3. Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

  4. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  5. Miryalaguda : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

  6. Number Plates : నెంబర్ ప్లేట్ మార్చడం తప్పనిసరి.. దగ్గర పడుతున్న మార్చే గడువు..!

మరిన్ని వార్తలు