Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

Number Plates : నెంబర్ ప్లేట్ మార్చడం తప్పనిసరి.. దగ్గర పడుతున్న మార్చే గడువు..!

Number Plates : నెంబర్ ప్లేట్ మార్చడం తప్పనిసరి.. దగ్గర పడుతున్న మార్చే గడువు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకుగాను నెంబర్ ప్లేట్లను మార్చేందుకు కొంత సమయం ఇచ్చింది. ఆ గడువులోగా పాత నెంబర్ ప్లేట్లను మార్చి కొత్త హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను అమర్చాలని పేర్కొన్నది.

ప్రస్తుతం తెలంగాణలో పాత నెంబర్ ప్లేట్ల తో తిరుగుతున్న వాహనాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 70.92 లక్షల పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చాలని రవాణా శాఖ గుర్తించింది. అయితే ఈ నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన వాటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు ఉన్నట్లు తెలుస్తోంది.

2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల నిబంధనలు వాహనాలకు అమలు అవుతూ వస్తున్నాయి. అప్పటి నుంచి నేటి వరకు దేశంలో ఈ నిబంధనలు ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్, గోవా, చత్తీస్గడ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో అమలవుతున్నాయి. కానీ ఈ నిబంధనలు తెలంగాణలో అమలు చేయడం లేదు.

కాగా నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరగకుండా అడ్డుకట్ట వేయడం చోరీలను అరికట్టడం కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల నిబంధనలు అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. అందుకుగాను సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది.

నెంబర్ ప్లేట్ల ధరను 320 రూపాయల నుంచి 860 రూపాయలుగా నిర్ణయించింది. అయితే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల కోసం వాహనదారులు ఓ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే మరో రూపంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల కోసం బుకింగ్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ నెల వరకు గడువు ఉన్నప్పటికీ మరికొంత సమయం పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

MOST READ :

  1. RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతాం..!

  3. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  4. TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

  5. Civils Rank : స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివాని.. RTC ఎండీ స‌జ్జ‌న‌ర్ సన్మానం..!

మరిన్ని వార్తలు