Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Mla Balunaik : దుర్గామాత వద్ద ఎమ్మెల్యే బాలునాయక్ ప్రత్యేక పూజలు..! 

దేవరకొండ పట్టణంలోని నాలుగో వార్డులో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mla Balunaik : దుర్గామాత వద్ద ఎమ్మెల్యే బాలునాయక్ ప్రత్యేక పూజలు..! 

మార్కండేయ స్వామి ఆలయంలో అమ్మవారి చీరల వేలంపాటలో పాల్గొన్న ఎమ్మెల్యే

(చింతపల్లి- వెంకట్, మనసాక్షి)

దేవరకొండ పట్టణంలోని నాలుగో వార్డులో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.

Also Read : కేబినెట్‌లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు.. బి.వి. రాఘవులు

అనంతరం దేవరకొండ పట్టణ పరిధిలోని మార్కండేయ స్వామి వారి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన చీరల వేలంపాట కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దుర్గామాత కరుణాకటాక్షాలతో దేవరకొండ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం.. భర్తను హత్య చేసిన భార్య..!

ఈ కార్యక్రమంలో పున్న శైలజ వెంకటేశ్వర్లు, మహ్మద్ రయీస్, మారుపాకుల సురేష్ గౌడ్, జింకల లింగయ్య, జింకల మధు, వనం నర్సింహా, జింకల మల్లయ్య, అన్నపూరి ఇస్తారి, మారుపల్లి కొండయ్య, జింకల చిన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు