ఒడిశాలో ఘోర ప్రమాదం.. 237 కు పెరిగిన రైలు ప్రమాద మృతులు

ఒడిశాలో ఘోర ప్రమాదం.. 237 కు పెరిగిన రైలు ప్రమాద మృతులు

మనసాక్షి ,వెబ్ డెస్క్:

ఒడిశాలో రైలు ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. శుక్రవారం రాత్రి వరకు 50 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా తెలిపారు. కాగా ఈ సంఖ్య ప్రస్తుతం 237 మందికి చేరినట్లు తెలుస్తుంది.

 

ఈ ప్రమాదంలో మరో 900 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఈ రైలు కోచ్ లలో 500 మందికి పైగా ఉన్నట్లు సమాచారంవ రాత్రి సమయంలో కూడా సహాయక చర్యలు చేపట్టారు. శనివారం తెల్లవారుజామునంచే యధావిధిగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. హెల్ప్లైన్ సెంటర్లను ప్రకటించారు. అదేవిధంగా 13 ట్రైన్ లను కూడా నిలిపివేశారు.