తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ట్రస్మా కార్యదర్శి శ్యాంసుందర్ కు ఘన సన్మానం..!

Miryalaguda : ట్రస్మా కార్యదర్శి శ్యాంసుందర్ కు ఘన సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) మిర్యాలగూడ పట్టణ కార్యదర్శిగా ఎన్నికైన ఓరుగంటి శ్యాంసుందర్ ను బుధవారం స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎస్ వి మోడల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఓరుగంటి శ్యాంసుందర్ ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణ కార్యదర్శిగా ఎన్నికైన శ్యామ్ సుందర్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోఆర్డినేటర్ వంగాల నిరంజన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు కందాల శ్రీనివాసాచారి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి శ్రీనివాస్, సెయింట్ జాన్స్ హై స్కూల్ చైర్మన్, జిల్లా నాయకులు అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వరప్రసాద్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ :

 

 

మరిన్ని వార్తలు