TG News : గిరిజన తండా టు.. ఆసియా క్రీడల వరకు ప్రయాణం..!

TG News : గిరిజన తండా టు.. ఆసియా క్రీడల వరకు ప్రయాణం..!
వెల్దండ, మన సాక్షి :
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని నగారగడ్డ తండాకు చెందిన కొర్ర లక్ష్మణ్ నాయక్ ఆసియా క్రీడలకు అంతర్జాతీయ స్థాయిలో కోచ్ స్థాయికి ఎదిగాడు. గిరిజన మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో పుట్టి బాల్యం లో కూలీగా, మరియు హోటల్లో పనిచేస్తూ .. చదువుకోవాలని బలమైన కోరికతో బాలానగర్ లోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్నాడు.
అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ ఉపాధ్యాయుడి నుండి శిక్షణ పొందాడు. ఆయన ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ లో పాల్గొనడం ప్రారంభించారు. జిల్లా మరియు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో అనేక పథకాలు సాధించాడు. హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ ఏ ఐ) కోచ్ రమేష్ సార్ లక్ష్మణ్ నాయక్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.
అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లలో ఐదు జాతీయస్థాయి పథకాలను గెలుచుకున్నారు. బహ్రెయిన్ (గోల్ఫ్ కంట్రీ) లో అక్టోబర్ 23 నుండి 26 జరిగిన మూడవ ఆసియా యూత్ గేమ్స్ లో భారత జట్టుకు కోచ్ గా విధులు నిర్వహించారు. ఇతని సారధ్యంలో క్రీడాకారుడు అనేక పథకాలు గెలుచుకున్నారు.
వారిలో జీవన్ జీ దీప్తి అర్జున అవార్డు గ్రహీత & మరియు పారా ఒలంపిక్స్ కాంక్ష పథక విజేత అగసర నందిని ఆసియన్ గేమ్స్ కాంస్య విజేత, దండి జ్యోతిక శ్రీ , బి అకిరానంద పార వరల్డ్ గ్రాండ్ ఫిక్స్ బంగారు పతక విజేత ఇలా తన శిక్షణలో అనేకమంది క్రీడాకారులను తయారు చేస్తూ గ్రామీణ యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. తమ్ముడే కాదు అన్న కూడా ఘనుడే .. కొర్ర రాము నాయక్ 40 సార్లు జాతీయస్థాయి క్రీడలలో పాల్గొని 20 సార్లు పథకాలు సాధించారు.
MOST READ :
-
Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!
-
Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!
-
TG News : తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే.. అందరూ పాల్గొనాలి..!
-
విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం..!
-
Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!









