TOP STORIESBreaking Newsతెలంగాణ

TS News : ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త తెలియజేసింది. దేశంలోని ప్రధాన నగరాలన్నీ కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ లో కూడా కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

TS News : ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త తెలియజేసింది. దేశంలోని ప్రధాన నగరాలన్నీ కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ లో కూడా కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి వాహనాల పెరుగుదల కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చును. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (ఇవి) వినియోగం వల్ల కాలుష్యం తగ్గించే అవకాశం ఉందని భావించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డిస్కౌంట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసేలా చర్యలు చేపట్టనున్నది. అందుకు సంబంధించిన విధివిధానాలను రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రకటించనున్నారు.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు