Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TS News : వాహనదారులకు భారీ గుడ్ న్యూస్.. రేపటి నుంచి అమల్లోకి..!

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు భారీ శుభవార్త తెలియజేసింది. ఇకనుంచి రెండో వాహనం కొనుగోలు చేసే వారికి అదనపు లైఫ్ టాక్స్ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TS News : వాహనదారులకు భారీ గుడ్ న్యూస్.. రేపటి నుంచి అమల్లోకి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు భారీ శుభవార్త తెలియజేసింది. ఇకనుంచి రెండో వాహనం కొనుగోలు చేసే వారికి అదనపు లైఫ్ టాక్స్ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఈనెల 23వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నది. ఇప్పటివరకు వాహనదారులు తన పేరు మీద ఒక వాహనం కలిగి ఉండి అదే పేరుతో రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే అదనంగా రెండు శాతం లైఫ్ టాక్స్ ను ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ నూతన నిర్ణయంతో ఇకపై అదనపు వారం ఉండదు. ఇది రాష్ట్రంలో లక్షలాదిమంది టు వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఊరట నిచ్చే అంశం.

తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసే వారికి అదనపు లైఫ్ టాక్స్ ఎత్తివేసే కార్యక్రమం సోమవారం నుంచి తెలంగాణ రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వాహన్ పోర్టల్లో చేరనున్నది. దీనిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతోమంది వాహనదారులకు ఇది మేలు చేసే అవకాశం ఉంది. వాహన పోర్టల్ లో చెరితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని నేషనల్ సర్వర్ తో అనుసంధానం చేస్తారు. వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీగా అవుతుంది.

సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేవారికి ఆ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్ లో తనిఖీ చేసుకోవచ్చును. మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల దొంగ వాహనాలు, అమ్మకాలు, కొనుగోళ్లకు పారదర్శకతకు అవకాశం ఉంది. అంతేకాకుండా డిజిటల్ విధానం వల్ల రవాణా శాఖ కార్యకలాపాల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. ఇకపై ఆర్ సి డూప్లికేట్ కాపీ, పేరు మార్పు, చిరునామా మార్పు, లోన్ తొలగింపు లాంటి అంశాలన్నీ కూడా ఆన్లైన్లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల ఆర్టిఏ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా తప్పుతుంది.

MOST READ 

మరిన్ని వార్తలు