Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Ts rtc : ఆర్టీసీలో విలేజ్ బస్ ఆఫీసర్లు… కొత్తగా నియామకం

Ts rtc : ఆర్టీసీలో విలేజ్ బస్ ఆఫీసర్లు… కొత్తగా నియామకం

హైదరాబాద్, మనసాక్షి :

ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన వ్యవస్థను తీసుకురానున్నారు. గ్రామాలలో విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించనున్నారు. కొత్తగా విలేజ్ ఆఫీసర్లను నియమించనున్నట్లు ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలియజేశారు. నూతన నియమాకంలో భాగంగా తొలి దశలో 1730 మందిని నియమించనున్నారు. ఇటీవల హైదరాబాదులోని బస్సు భవన్ లో జరిగిన సమావేశంలో సజ్జనార్ పేర్కొన్నారు.

పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం వివిధ అంశాలకు ఆర్టీసీ బస్సులను ప్రస్తుతం ప్రజలు వినియోగించుకుంటున్నారు. కాగా ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా జాతరలు, సంతల సమయాల్లో ఆయా రోడ్లలో బస్సు సర్వీసులు పెంచనున్నారు. విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థతో మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ ఎండి ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు