TOP STORIESజాతీయం

Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

ప్రస్తుత పరిస్థితులలో ఆర్దిక పొదుపు చాలా ముఖ్యం. రోజురోజుకు ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఇంటి ఖర్చులతో పాటు పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇలాంటి ఆర్థిక భారం భారీగా అవుతుంది. అయితే మీరు ఏదో ఒక స్కీమ్ లో డబ్బులు ఎంతో కొంత దాచుకుంటే అది వస్తాయనే నమ్మకం కూడా లేకుండా పోతుంది.

Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

మన సాక్షి :

ప్రస్తుత పరిస్థితులలో ఆర్దిక పొదుపు చాలా ముఖ్యం. రోజురోజుకు ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఇంటి ఖర్చులతో పాటు పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇలాంటి ఆర్థిక భారం భారీగా అవుతుంది. అయితే మీరు ఏదో ఒక స్కీమ్ లో డబ్బులు ఎంతో కొంత దాచుకుంటే అది వస్తాయనే నమ్మకం కూడా లేకుండా పోతుంది.

కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షల రూపాయలు ఇస్తుంది. ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న కిసాన్ వికాస పత్ర యోజన పథకం.. దీర్ఘకాలంలో కచ్చితంగా మీరు పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. ఇది ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే పథకంలా ఆలోచించాలి.

ఈ పథకాలనే పోస్ట్ ఆఫీస్ స్కీం లేదా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. వీటిల్లో ఎలాంటి రిస్కుండదు. నిర్దిష్ట కాలపరిమితికి నిర్దిష్ట వడ్డీరేట్ల ప్రకారం రిటర్న్స్ వస్తాయి. కిసాన్ వికాస పత్రం.. ఇది ఒక ప్రత్యేకమైన స్కీం. ప్రస్తుతం వడ్డీరేట్ల ప్రకారం కచ్చితంగా 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుంది. మనం ఎంత పెట్టుబడి పెడితే అంతకు డబుల్ వస్తుంది.

ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెడితే 115 నెలల్లో అది రెండు లక్షల రూపాయలు అవుతుంది. అదే ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 115 నెలల్లో 10 లక్షలు అవుతుంది. దీనికి ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది. సామాన్యులకు ఇది చాలా మంచి అవకాశం.

ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం 7.5%. పోస్ట్ ఆఫీస్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లు సవరిస్తుంది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం వడ్డీ ఎక్కువగా వస్తే తక్కువ కాలంలోనే మీ పెట్టుబడి డబుల్ అయ్యే అవకాశం ఉంది. మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకొని పెట్టుబడి పెడితే చాలా మంచిది.

MOST READ : 

  1. Sankranti Special : రాజమండ్రికి మించిన మర్యాద.. కొత్త అల్లుడికి 158 వంటకాలతో సంక్రాంతి విందు..!

  2. CM Revanth Reddy : తెలంగాణకు సైనిక్ స్కూలు మంజూరు చేయండి..!

  3. Khammam : విషాద ఘటన.. ఆడుకుంటూ వెళ్లి సాంబారులో పడి చిన్నారి మృతి..!

  4. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

  5. TG News : మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. వారు BRS లోనే ఉన్నారు..!

మరిన్ని వార్తలు