Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత రెండు నెలలుగా నీళ్లు రావడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన ధర్నా చేపట్టారు.

Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

తుంగతుర్తి మన సాక్షి:

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత రెండు నెలలుగా నీళ్లు రావడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ రెండు నెలల నుండి నల్లాలు రాక నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని అధికారులు, గ్రామపంచాయతీ కార్యవర్గం నిమ్మకు నీరేత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పండుగ దగ్గరికి వస్తున్న కనీసం వాడుకోవడానికి కూడా నీళ్లు లేక బోర్ల కానుండి బిందెలతో మోసుకుంటున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తమకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్నూరు పూర్ణమ్మా, కటకం ఈశ్వరమ్మ , లింగమ్మ, తడకమళ్ల గంగమ్మ, తడకమళ్ల యాదమ్మా, తడకమళ్ల హేమలత, పానగంటి స్వప్న, కటకం రామ, జ్యోతి, కటకం రవి, బొంకూరి మల్లేష్ , తడకమళ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వారు విస్తృత తనిఖీలు నిర్వహించాలి..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  3. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఇవి పాటించండి..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

మరిన్ని వార్తలు