సూర్యాపేట :  రోడ్డు పై చెత్త వేసినందుకు రూ. 2 వేలు జరిమానా

సూర్యాపేట :  రోడ్డు పై చెత్త వేసినందుకు రూ. 2 వేలు జరిమానా

సూర్యాపేట, జులై30, మనసాక్షి:  చెత్తను రోడ్డు మీద వేసి పరిసరాలను ఆపరిశుభ్రంగా తయారు చేసిన వారికి జరిమానా విదిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని మహాత్మ గాంధీ విగ్రహము సమీపంలో గల అపోలో పార్మసి వారికి చెత్త రోడ్డు ఫై పోయకుండా డస్ట్ బిన్ పెట్టుకోమని పలు మార్లు ఆదేశించినప్పటికి అట్టి షాప్ యజమాన్యము వారు నిర్లక్షము గా వ్యవహరించారు.

ALSO READ : ఫ్లాష్ ఫ్లాష్  షాద్‌నగర్‌ వద్ద డ్రగ్స్ కలకలం

చెత్తను రోడ్డు ఫై పోసినందుకు గాను మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి  ఆదేశంల మేరకు రూ.2000/-లు జరిమాన విధించడం జరిగిందని సానిటరీ ఇన్స్పెక్టర్ బండ జనార్దన్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలు , దుకాణం దారులు చెత్తను భద్రపరిచి విధుల్లో కి వచ్చే చెత్త సేకరణ వాహనాలకు అందించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో సానిటరీ జవాన్ లు కొత్త మధు, శ్రీనివాస్, మొలకల పల్లి పరుశురాములు మెడికల్ షాప్ యజమానికి జరిమానా బిల్లు అందజేశారు.