క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

BREAKING : రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు మృతి..!

BREAKING : రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు మృతి..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాద్ నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 25 నుండి 30 సంవత్సరాలు ఉంటుందన్నారు.

షాద్ నగర్ రైల్వే స్టేషన్ మాస్టర్ రాహుల్ కుమార్ ఫిర్యాదు మేరకు, రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.మల్లేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే కింద ఇచ్చిన 9848909426 ఫోన్ నంబర్ కు తెలియచేయాలని కోరారు.

మృతి చెందిన యువకుడుపై గ్రే కలర్ రెన్ కోట్, గ్రీన్ కలర్ టీ షర్ట్స్, బ్లూ కలర్ లోయర్ కుడిచేయికి రాగి ఉంగరం ధరించి ఉన్నాడన్నారు. మృత దేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచడం జరిగిందన్నారు.

ALSO READ : 

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!

District collector : రుణమాఫీ ఫిర్యాదుల విభాగం మండలాల్లో నిరంతరం నడిపించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు