Mobile App : మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలి..!

Mobile App : మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలి..!
చింతపల్లి, మనసాక్షి.
యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణం ల వద్ద బారులు తీరాల్సిన పని లేకుండా మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయశాఖ అధికారి శ్రావణ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలోని రైతు కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ . రైతులు వారికి అవసరం అయిన యూరియాను ఈనెల 20వ తారీకు నుండి ఆన్లైన్ యాప్ ద్వారా బుక్ చేసుకొని యూరియాను తెచ్చుకోవచ్చు అన్నారు.
రైతులు వారికి ఉన్న సాగుభూమి ప్రకారం యూరియా అందివ్వ పడుతుందన్నారు . కవులు రైతులు భూమి యజమాని వివరాలు నమోదు చేసి తద్వారా తద్వారా యూరియాను పొందవచ్చు అన్నారు .రైతులు తమ ఇంటి నుంచే మొబైల్ లో యాప్ ద్వారా తమకు కావలసిన యూరియా ను బుక్ చేసుకోవచ్చు. రైతులు యాప్ లో తమకు నచ్చిన డీలర్ నిఎంచుకుని బుక్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు..
బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ ఐడి వస్తుందన్నారు. ఆడి తో పాటు రైతు పాస్ బుక్, ఆధార్ తీసుకొని బుక్ చేసుకున్న డీలర్ దగ్గరకు వెళ్లి యూరియా తీసుకోవచ్చు అన్నారు . మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి యూరియా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లో రైతు పాసుబుక్ నంబర్ నమోదు చేస్తే ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ కి ఓటిపి వస్తుంది. దీనిని నమోదు చేసిన తర్వాత రైతుల భూమి విస్తీర్ణం, పంటల సాగు వివరాల ఆధారంగా ఎన్ని బస్తాల యూరియా బుక్ చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.
యూరియా బుకింగ్ లో ఏమైనా సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. మండలంలోని రైతురు ఈ అవకాశాన్ని సద్వినియోగంపరచుకోవాలని సూచించారు.
MOST READ
-
TGPSC : తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల..!
-
Suryapet : మంత్రి ఉత్తమ్ కు బిగ్ షాక్.. ఉత్తమ్ ఇలాకాలో అతిపెద్ద గ్రామపంచాయతీ బీఆర్ఎస్ కైవసం..!
-
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పునరాలోచించాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..!
-
Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!









