Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!

Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో అధిక ధరలకు ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులకు యూరియా విక్రయించినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవో మాధవ రెడ్డి గురువారం రోజున గుర్రంపోడు మండల కేంద్రంలో శ్రీ శరవణ ఫర్టిలైజర్ షాపు, శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్ షాపు, సాయిరాం ఏజెన్సీ లను తనిఖీ చేశారు.

ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా బస్తాలకు సంబంధించిన బుక్కులు, రసీదులను పరిశీలించి, యూరియా కొనుగోలు చేసిన రైతులను సంప్రదించి విచారణ చేపట్టారు. ప్రభుత్వం యూరియా బస్తాకు సబ్సిడీగా రూ.266 అందిస్తుండగా, కొన్ని దుకాణాల్లో యూరియా బస్తాను రూ.300 వరకు అధిక ధరకు అమ్ముతున్నట్లు నిర్ధారించారు.

దీంతో రైతులు అధిక ధర చెల్లించి మోసపోతున్నట్లు గుర్తించారు. అనంతరం ఏవో , శరవణ ఫర్టిలైజర్స్ యజమాని ఎర్ర శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్ యజమాని బొమ్ము ఆనంద్, సాయిరాం ఏజెన్సీ యజమాని చందా గోవిందరెడ్డి లపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారు.

పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు గుర్రంపోడు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మండల వ్యవసాయ శాఖ తరఫున ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని ఏవో తెలిపారు.

MOST READ ; 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ.. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..!

  2. Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!

  3. Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

  4. Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!

  5. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు