VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!

VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు. యూఎస్ వెళ్లాలనుకునే వారికి కఠినమైన నిబంధనలను తీసుకువచ్చారు. తాజాగా ఆరోగ్య విషయంలో కూడా వలసదారులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
అమెరికా వెళ్లాలనుకునే వారికి డయాబెటిస్, ఉబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలని కొత్త నిబంధనలను జారీ చేశారు. వీసా మార్గదర్శకాలను దేశ రాయబార కార్యాలయాలు, కౌన్సులర్ కార్యాలయాలనుకు పంపించింది.
గతంలో టీబీ వంటి అంటువ్యాధులకు స్క్రీనింగ్ నిర్వహించి వీసాలపై నిర్ణయం తీసుకునేవారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, ఉపకాయం లాంటి జబ్బులకు కూడా ఆ జాబితాలో చేర్చారు. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుల వైద్య చరిత్రను అధికారులు మరింతంగా పరిశీలించి అనుమతించాలా..? వద్దా..? అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉంటే వారిని అనుమతిస్తే ఖజానా పై అదనపు భారం పడుతుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని వీసాపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉంటే దరఖాస్తుదారులకు వీసాలను నిరాకరించే నిబంధనలను కఠినతరం చేశారు. గుండె జబ్బులు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్, డయాబెటిస్, నాడీ సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అమెరికా వీసా తిరస్కరించే అవకాశం ఉంది.
ఆయా సమస్యలపై వీసా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విదేశాంగ శాఖ ఈ వార్తలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అమెరికా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయా? లేదా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
MOST READ :
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!
-
ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!
-
Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!









