Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!

Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!

చౌటుప్పల్, మన సాక్షి :

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్(26) గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.కిడ్నీలు దెబ్బతిన్నాయని కిడ్నీ మారిస్తే కానీ బ్రతకె పరిస్థితి లేదని వైద్యులు చెప్పారు.

కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కూడా చెప్పారు.గణేష్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు,అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో భగవంతునిపై భారం వేసి రోజులు వెలదీస్తున్నారు.

గణేష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడంతో విషయాన్ని స్థానిక నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏర్పాటు చూడాలని ఆదేశించారు. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు 12.50 లక్షల రూపాయలను కామినేని ఆసుపత్రికి చెల్లించి గణేష్ కు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు.

చికిత్స అనంతరం ఆదివారం కామినేని ఆసుపత్రికి వెళ్లి గణేష్ బాగోగులు తెలుసుకున్నారు.గణేష్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.తన కుమారునికి సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కార్పొరేట్ వైద్యం అందించిన రాజగోపాల్ రెడ్డి కి గణేష్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించి నా కుమారునికి పునర్జన్మ ప్రసాదించావన్నారని కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు.

నెల్లి గణేష్ కు సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వభావానికి సహాయం చేసే గుణానికి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. Champion : నేషనల్ గేమ్ ఛాంపియన్‌కు ఎంపికైన యువతి.. దాతల కోసం ఎదురుచూపు..!

  2. Hyderabad : మియాపూర్ లో ఐదంతస్తుల అక్రమ భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు..!

  3. Paddy : కొత్త రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి..!

  4. New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

మరిన్ని వార్తలు