Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..!

Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..!
నల్లగొండ, మన సాక్షి :
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జాగృతి జనం బాట పట్టిందని 33 జిల్లాలలో పర్యటించి అక్కడి సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆమె జిల్లాలోని కిష్టరాయిని పల్లి, నెల్లికలు, నక్కలగండి , మిర్యాలగూడ, దామరచర్ల, వాడపల్లి బుధవారం ఉదయం నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి అనంతరం స్థానిక మనోరమ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
బీఆర్ఎస్ ను తిట్టి తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఎస్ఎల్ బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేస్తారని అన్నారు.
సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులది ఫెవికాల్ బంధం నన్నారు.కృష్ణానది నీళ్లు తేవటంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం అని హెచ్చరించారు.
వెంకట్ రెడ్డి అన్న నాతో ఏం పంచాయితీ ఉంది? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు అని అడిగారు. జాగృతితో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదన్నారు
ఇప్పుడు రాజకీయాలు చేయటానికి రాలేదని
రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతాం అని తెలిపారు
ముందు ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల దుఖాన్ని చూడమన్నారు.
నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లాని రాజ్యాలు, ప్రజా ఉద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం అనీ
ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు బౌద్ధం, జైనం తో పాటు అద్భుతమైన ఆలోచన సరళి కలిగిన జిల్లా అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మా ఇక్కడి చరిత్రను గుంటూరుకు తీసుకెళ్లారని ఉద్యమం సమయంలో దీనిపై మేము పోరాటం చేశాం అని తెలిపారు. నాగార్జున కొండ వద్ద ఉన్న స్థూపాన్ని కూడా గుంటూరు కు తీసుకెళ్లారని, పానగళ్లు లో ఉన్న ఎన్నో విగ్రహాలను అక్కడకు తీసుకెళ్లారని తెలంగాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలేదాన్నారు.
జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంద ని
మేము ఇక్కడి చరిత్ర తెలుసుకునే క్రమంలో 60 వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని తెలిసిందన్నారు. పచ్చల, ఛాయ సోమేశ్వరం ఆలయాలు ఇక్కడ ఉన్నాయనీ, ఇంకో పక్క సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని, సాయుధ రైతాంగ పోరాటం చేయని ఇళ్లు ఇక్కడ లేదన్నారు.
ఆనాటి ఉద్యమ కారులు మల్లు స్వరాజ్యంని ఇటీవలే మనం కోల్పోయాంమని,
కానీ ఇప్పటికీ కూడా జిల్లాలో అదే చైతన్యం ఉందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరిగాను.
హుజుర్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఎత్తుకొని నేను తిరిగానన్నారు.
బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి అన్నారు.
అందుకే ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు ఉండాలి. వారిపై ఒత్తిడి పెట్టినప్పుడే పనులు అవుతాయి అని తెలిపారు. ఇక్కడి సుంకిశాలను హైదరాబాద్ నీటి అవసరాలకు సెకండ్ అల్టర్ నేట్ అని గతంలో కేటీఆర్ ప్రారంభించారని
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఉందని
కనీసం ఆ విషయాన్నిబయటకు కూడా చెప్పలేదన్నారు.
కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోందని భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని. వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదన్నారు. నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేని పరిస్థితని, బంగారు తెలంగాణ అంటే మారాల్సింది పేదల జీవన పరిస్థితులన్నారు.
MOST READ :









