TGEAPSET : తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన షురూ.. ఇవి ఉన్నాయేమో సరిచూసుకోండి..!

తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ గురువారంతో ప్రారంభం కాగా సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది.

TGEAPSET : తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన షురూ.. ఇవి ఉన్నాయేమో సరిచూసుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ గురువారంతో ప్రారంభం కాగా సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. మొదటి విడతలో కౌన్సిలింగ్ అభ్యర్థులకు 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. నిబంధన మేరకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయో.. అభ్యర్థులు ముందుగానే చెక్ చెక్ చేసుకోవాల్సి ఉంది. పరిశీలన కేంద్రాలకు ముందుగా వెళ్లి స్లాట్ టైంలో తప్పనిసరిగా సెంటర్ లో ఉండాలి.

మొదటి దశ కౌన్సిలింగ్ కోసం ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్స్ చేసుకునే అవకాశం ఉంది. మొదటి విడతలో స్లాట్ బుకింగ్ చేసుకుంటే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 19వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా ఇక రెండవ విడత 19వ తేదీ నుంచి 26వ తేదీన స్లాట్ బుకింగ్, 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన, 27, 28వ తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదు. 31 వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత 31వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశా లలో రిపోర్టు చేయాలి.

అదేవిధంగా చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 8వ తేదీన స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ తొమ్మిదో తేదీన పరిశీలిస్తారు. 9, 10 తేదీలలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటే 13వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. అనంతరం 13 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ మూడు దశల్లో విద్యార్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక కళాశాల మార్చుకోవాలని ఉంటే ఆగస్టు 16, 17 వ తేదీలలో అవకాశం కల్పించారు.

కావలసిన సర్టిఫికెట్లు :

కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు ఏఏ సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలని ఆందోళన చెందుతుంటారు. అలాంటి ఆందోళన లేకుండా ముందుగానే ఏ సర్టిఫికెట్లు కావాలో నిర్ణయించింది.

♦️విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు వెంట తీసుకుని వెళ్లాలి.

♦️టీ జి ఎఫ్ సెట్ హాల్ టికెట్.

♦️TS EAPCET ర్యాంకు కార్డు.

♦️ఆధార్ కార్డు.

♦️ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు.

♦️6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ల

♦️ఇంటర్మీడియట్ టి సి,

♦️ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం.

♦️స్లాట్ బుకింగ్ చేసుకున్న రషీదు.

♦️ఈ డబ్ల్యు అభ్యర్థులు అయితే ఈ ఏడాది తీసుకున్న సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది.

ALSO READ : 

ACB RAIDS : రూ.15వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇంజనీరింగ్ ఏఈ..!

BREAKING : వైద్య సేవలు ఎలా ఉన్నాయి.. ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగిన జిల్లా కలెక్టర్..!