Miryalaguda : ప్రజా పాలన విజయోత్సవాలు.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
Miryalaguda : ప్రజా పాలన విజయోత్సవాలు.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
అడవిదేవులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని బాల్నేపల్లి, చిట్యాల గ్రామాలలో మంగళవారం ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ అభివృద్ధి శాఖ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సర కాలం కావస్తుందన్నారు. ఈ ఏడాది కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల కుప్పగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అన్ని శాఖలను ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ ప్రజలకు ఒక సుస్థిర పాలన అందించాలని, ఉద్దేశంతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ఒక్కొక్క దానిని అమలు చేస్తూ,కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్,సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు రమావత్ బాలునాయక్,
మండల కాంగ్రెస్ నాయకులు,బండి నాగేశ్వరరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దశరథ నాయక్,బండి నరసింహారావు, కుర్ర రమేష్, కొర్ర అశోక్, మోతిలాల్, హనుమా, నాగు నాయక్, కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : 30 ఏళ్లుగా ఒకే వ్యక్తి ఆధీనంలో.. సరాయే మీరాలం మస్జిద్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలి..!
-
WhatsApp : వాట్సప్ సీక్రెట్ చాట్. అదిరిపోయేలా ఈ కొత్త ఫీచర్..!
-
Miryalaguda : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడాపోటీలకు శిష్య పాఠశాల విద్యార్థులు..!
-
Gold Price : పడిపోయిన పసిడి ధర.. వరుసగా రెండో రోజు భారీగా రూ.13,100 తగ్గింది..!










