Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

WhatsApp : వాట్సప్ సీక్రెట్ చాట్. అదిరిపోయేలా ఈ కొత్త ఫీచర్..!

WhatsApp : వాట్సప్ సీక్రెట్ చాట్. అదిరిపోయేలా ఈ కొత్త ఫీచర్..!

మన సాక్షి, వెబ్ డిస్క్:

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ను కోట్లాదిమంది వినియోగిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వ్యక్తిగత సమాచారం కూడా ఎవరికి తెలియకుండా ఉండేందుకు కొత్త కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడి అదిరిపోయేలా ఉంది.

వాట్సాప్ కొత్త ఫీచర్.. చాట్ లాక్. దీంతో సీక్రెట్ చాట్ చేసే అవకాశం ఉంది. చాట్ లాక్ ఫీచర్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ని వాట్సాప్ పరిచయం చేసింది. ఇది వ్యక్తిగత చాట్ ను దాచుకునే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత చాట్ ను సీక్రెట్ కోడ్ ను క్రియేట్ చేసుకుని మీ చాట్ ని రహస్యంగా దాచుకునే అవకాశం ఉంది. లాక్ చేసిన చాట్ ను లాక్ చాట్ సెక్షన్లో చూసుకోవచ్చు. లాక్ చాట్ సెక్షన్ ఇతరులు ఓపెన్ చేసే వీలులేకుండా సీక్రెట్ గా పాస్వర్డ్ పెట్టుకునే అవకాశం ఉంది.

మీ చాట్ సీక్రెట్ గా భద్రంగా ఉంచుకోవచ్చు. అలాగే ఇది యాప్ లో కనిపించకుండా కూడా చూసుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేస్తుంది. మీరు వాట్సాప్ లో చాట్ చేయడం సీక్రెట్ గా లాక్ చేసుకునే అవకాశం ఉంది. మళ్లీ మీ సీక్రెట్ కోడ్ ఆధారంగానే లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు